మరిన్ని ఇన్నోవేషన్‌ హబ్స్‌ రావాలి

ABN , First Publish Date - 2021-11-27T06:13:37+05:30 IST

ఫార్మాస్యూటికల్‌, లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ.. హైదరాబాద్‌, తెలంగాణాల్లో కీలకమైన భాగం. దాదాపు 800 పైగా ఫార్మా, బయోటెక్‌, మెడ్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో....

మరిన్ని ఇన్నోవేషన్‌ హబ్స్‌ రావాలి

డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫార్మాస్యూటికల్‌, లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ.. హైదరాబాద్‌, తెలంగాణాల్లో కీలకమైన భాగం. దాదాపు 800 పైగా ఫార్మా, బయోటెక్‌, మెడ్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు, దేశంలో ఉత్పత్తి అయ్యే 30 శాతం ఔషధాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్న బల్క్‌డ్రగ్స్‌లో హైదరాబాద్‌ నుంచి 50 శాతం ఎగుమతి అవుతున్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు. 2030 నాటికి హైదరాబాద్‌ ఫార్మా రంగం మూడింతలయ్యే వీలుందని.. ఇందుకు కొత్త ఔషధాల అభివృద్ధి, ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. పరిశ్రమ వృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 


తెలంగాణలో బిజినెస్‌, ఇన్వె్‌స్టమెంట్‌ అవకాశాలపై సీఐఐ, తెలంగాణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీశ్‌ రెడ్డి మాట్లాడారు. అనేక లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి అనేక అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా నిపుణుల లభ్యత. దేశంలోనే అత్యుత్తమ పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విధానాలు పరిశ్రమకు అనకూల అంశాలని సతీశ్‌ రెడ్డి తెలిపారు. ఇన్నోవేషనే భవిష్యత్తు దీన్ని హైదరాబాద్‌ గుర్తించాలన్నారు. 


ఐటీ రంగంలో 12.9% వృద్ధి: ఐటీ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకర మద్దతు ఇస్తోందని.. అందుకే తెలంగాణ ఐటీ పరిశ్రమ ఎగుమతులు 12.9 శాతం పెరిగాయని టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీ  రాజన్న అన్నారు. హైదరాబాద్‌ పెద్ద టాలెంట్‌ హబ్‌. ఏటా 4 లక్షల మంది గ్రాడ్యుయేట్లు విద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ రంగంలో వెయ్యికి పైగా ఎంఎ్‌సఎంఈలు ఉన్నాయని.. ఇవి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నాయని సీఐఐ తెలంగాణ వైస్‌ చైర్మన్‌ వాగిష్‌ దీక్షిత్‌ అన్నారు.  

Updated Date - 2021-11-27T06:13:37+05:30 IST