ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ విజయ్‌భార్గవ్‌

ABN , First Publish Date - 2022-01-30T06:24:29+05:30 IST

ఇండియన మెడికల్‌ అసోసియేషన (ఐఎంఏ) జిల్లా నూతన కమిటీని భువనగిరిలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ విజయ్‌భార్గవ్‌
ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం

భువనగిరి టౌన, జనవరి 29: ఇండియన మెడికల్‌ అసోసియేషన (ఐఎంఏ) జిల్లా నూతన కమిటీని భువనగిరిలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ విజయ్‌భార్గవ్‌, ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ ఎడ్ల అనిల్‌కుమార్‌, కార్యదర్శిగా డాక్టర్‌ కె.కృష్ణచైతన్య, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్‌ రాజ్‌కుమార్‌, కోశాధికారిగా డాక్టర్‌ సుమంత, సలహాదారుడిగా డాక్టర్‌ ఎం.గిరిధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, పర్యవేక్షణలో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వైద్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ సంపత, డాక్టర్‌ నాగేందర్‌రెడ్డి, డాక్టర్‌ లవకుమార్‌రెడ్డి, డాక్టర్‌ రాజమౌళి, జిల్లా ఐఎంఏ ప్రతినిధులు వల్లాల అమరేందర్‌, అనసూయ, మోహన, అజయ్‌కుమార్‌, పద్మజ, వై.జనార్ధనరెడ్డి, రచ్చ సత్యనారాయణ, రాపోలు సత్యనారాయణ, ప్రభాకర్‌, ఎం.శ్రీనివాస్‌ హాజరయ్యారు. 


Updated Date - 2022-01-30T06:24:29+05:30 IST