డ్రాగన్ ఫ్రూట్‌కి కొత్త పేరు పెట్టిన గుజరాత్ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-01-20T05:20:50+05:30 IST

డ్రాగన్ ఫ్రూట్‌కి కొత్త పేరు పెట్టిన గుజరాత్ ప్రభుత్వం!

డ్రాగన్ ఫ్రూట్‌కి కొత్త పేరు పెట్టిన గుజరాత్ ప్రభుత్వం!

గాంధీనగర్: డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’ పండుగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పేటెంట్ మార్పునకు ప్రతిపాదనలు పంపినట్టు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. ఒక పండును డ్రాగన్ అనే పేరుతో పిలవడం వినసొంపుగా లేనందున ప్రభుత్వం దీన్ని ‘కమలం’ పేరుతో పిలవాలని నిర్ణయించుకున్నట్టు సీఎం పేర్కొన్నారు. మంగళవారం హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘డ్రాగన్ ఫ్రూట్‌ను కమలం అని పిలవాలంటూ పేటెంట్‌కు దాఖలు చేశాం. అయితే ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం దీన్ని కమలం పండుగా వ్యవహరించాలని నిర్ణయించింది..’’ అని విజయ్ రూపానీ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కమలం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఆ పండు కూడా కమలం ఆకారంలో లేదు. అందుకే దీన్ని మేము కమలం అని పిలవాలని భావిస్తున్నాం. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదు..’’ అని రూపానీ వివరించారు. బీజేపీ ఎన్నికల గుర్తు ‘కమలం’ కాగా.. గాంధీ నగర్‌లోని రాష్ట్ర బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి కూడా ‘శ్రీకమలం’ అని పేరుపెట్టడం విశేషం.

Updated Date - 2021-01-20T05:20:50+05:30 IST