Abn logo
Oct 29 2020 @ 22:46PM

ముంచుతున్న మురుగు కాల్వలు

తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయిన చినకాపవరం డ్రెయిన్‌Kaakateeya

ఆకివీడు, అక్టోబరు 29: చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి. ముంపు తొలగడానికి కూడా అవకాశం లేక రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు మురుగు కాల్వలతో ఆకివీడు సమతానగర్‌, సుందరయ్యకాలనీ, పుచ్చలదిబ్బ, సిద్ధాపురం వంతెన కింద, ధర్మాపురం అగ్రహారం ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే డబ్లింగ్‌ పనుల్లో భాగంగా ఉప్పుటేరు బ్రిడ్జి దగ్గర పూడికతో ముంపు తొలగడంలేదని పలువురు వాపోతున్నారు.

Advertisement
Advertisement