Abn logo
Sep 25 2021 @ 00:45AM

ఎన్నికలో నాటకీయ పరిణామాలు

కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన ‘ఆలూరు’ 


యల్లనూరు, సెప్టెంబరు 24: మండలంలో శుక్రవా రం నిర్వహించిన ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలో నాటకీ య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 10 గం టలకు ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఎంపీడీఓ కా ర్యాలయానికి హాజరయ్యారు. మిగిలిన 8 మంది సమావేశానికి వస్తారా? లేదా అని అందరూ ఉత్కంటగా ఎదురుచూశారు. ముందు అనుకున్న ప్రకారం కే సావిత్రికే ఎం పీపీ పదవి ఇవ్వడానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ ర్గం ససేమిరా అన్నారు. దీంతో ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి మరొకసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఇద్దరు సూచించిన వారికి కాకుండా బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవికి ఎంపీపీ పదవి ఇచ్చేలా, గొడ్డుమర్రి ఎంపీటీసీ సభ్యుడు రంగయ్య కు ఉప ఎంపీపీ ఇచ్చేలా నిర్ణయించారు. ఈక్రమంలో 8 మంది ఎంపీటీసీ సభ్యులు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు.ఎంపీటీసీలు హా జరైన తర్వాత కో ఆప్షన మెంబర్‌గా కల్లూరు గ్రామానికి చెందిన బషీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక జరుగుతుందని అధికారులు తెలిపారు.


సాంబశివారెడ్డి రాకతో మార్పు అనుకున్న ప్ర కారం ఎంపీపీగా గంగాదేవి, వైస్‌ ఎంపీపీ రంగయ్య ఎన్నికవుతారని భావిస్తుండగా, ఒక్కసారిగా మూడు వాహనా ల్లో ఎంపీడీఓ కార్యాలయం వద్దకు ఆలూరు సాంబశివారె డ్డి అనుచరవర్గంతో కార్యాలయంలోకి వచ్చారు. గేట్‌ వద్ద బందోబస్తులో ఉన్న రూరల్‌ సీఐ మల్లికార్జునగుప్త ఎదురుగానే వారు లోపలికి చొచ్చుకొని వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లి ఎంపీడీఓ ఓబులమ్మతో మాట్లాడారు. సమావేశ గదిలో ఉన్న ఎంపీటీసీల వద్దకు వెళ్లిన సాంబశివారెడ్డి వైస్‌ ఎంపీపీ రంగయ్యకు బదులుగా కొత్తమిద్దె సావిత్రికి మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. పెద్దారెడ్డి వర్గానికి చెం దిన వారు లోపల ఏమి జరుగుతోందోనని బయట గుమికూడుతుండగా, ఎస్‌ఐ జగదీష్‌ సాంబశివారెడ్డి వెంట వెళ్లి న వారిని బయటకు పంపారు. ఎంపీపీగా గంగాదేవిని ఎంపీటీసీ రంగయ్య బలపరిచారు. అనంతరం 8మంది స భ్యులు అనుకూలంగా చేతులెత్తారు. ఉప ఎంపీపీగా కొత్తమిద్దె సావిత్రికి చిలమకూరు ఎంపీటీసీ బలపరిచారు. దీంతో ఇరువురు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి డిక్లరేషన ఇచ్చారు. కాగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల చేత అధికా రులు ప్రమాణస్వీకారం చేయించకపోవడం కొసమెరుపు.