‘ద్రవిడ్ కోపంతో భయపడిపోయా.. వెంటనే డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి..’

ABN , First Publish Date - 2021-06-14T23:41:48+05:30 IST

‘నువ్వు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడివి. ఇలాంటి టీ షర్ట్ ధరిస్తావా..?’ అంటూ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనపై ఆగ్రహం..

‘ద్రవిడ్ కోపంతో భయపడిపోయా.. వెంటనే డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి..’

ఇంటర్నెట్ డెస్క్: ‘నువ్వు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడివి. ఇలాంటి టీ షర్ట్ ధరిస్తావా..?’ అంటూ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా తన జీవిత కథ ‘బిలీవ్’లో రాసుకొచ్చాడు. ‘‘2005లో తాను ద్రవిడ్ సారథ్యంలోనే టీమిండియాలోకి అడుగు పెట్టాను. ఏడాది తర్వాత ఆసీస్, విండీస్‌లతో ట్రై సిరీస్ సందర్భంగా ద్రవిడ్ కెప్టెన్సీలోనే మలేషియా టూర్ వెళ్లాం. అదే సమయంలో తాను ‘fcuk’ అనే అక్షరాలు రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఆయన కంట పడ్డాను. వెంటనే నాపై ఆయన అరిచేశారు.


‘నీవు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నావు. ఇలాంటి టీషర్టులు ధరించకూడదు. భారత క్రికెటర్‌గా హుందాతనంతో ఉండాలి. అలాంటి దుస్తులే వేసుకోవాలి’ అని మందలించార’ని రైనా చెప్పుకొచ్చాడు. ద్రవిడ్ కోపంతో తనకు భయమేసిందని, వెంటనే డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి ఆ టీషర్టును తీసి డస్ట్‌బిన్‌లో వేసేశానని, వెంటనే వేరే టీ షర్ట్ వేసుకుని బయటకొచ్చానని రైనా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-06-14T23:41:48+05:30 IST