బీసీసీఐ ‘కొవిడ్‌’ టాస్క్‌ఫోర్స్‌లో ద్రావిడ్‌

ABN , First Publish Date - 2020-08-04T09:09:25+05:30 IST

జాతీయ క్రికెట్‌ అకాడమీలో (ఎన్‌సీఏ)..కార్యకలాపాల పునరుద్ధరణకు కొవిడ్‌ -19 టాస్క్‌ఫోర్స్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది...

బీసీసీఐ ‘కొవిడ్‌’ టాస్క్‌ఫోర్స్‌లో ద్రావిడ్‌

ముంబై: జాతీయ క్రికెట్‌ అకాడమీలో (ఎన్‌సీఏ)..కార్యకలాపాల పునరుద్ధరణకు కొవిడ్‌ -19 టాస్క్‌ఫోర్స్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఎన్‌సీఏ డైరెక్టర్‌ ద్రావిడ్‌తోపాటు, అకాడమీ వైద్యాధికారి, బీసీసీఐ ఆపరేషన్స్‌ ఏజీఎం సభ్యులుగా ఉంటా రు. ఇక, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎ్‌సఓపీ) సోమవారం జారీ చేసింది. శిక్షణ కేంద్రాల్లోని క్రికెటర్లు సాధన ప్రారంభించేందుకు ‘అంగీకార’ పత్రంపై సంతకం చేయాలని ఎస్‌ఓపీలో బీసీసీఐ సూచించింది.

Updated Date - 2020-08-04T09:09:25+05:30 IST