Anti tank guided missile: DRDO ప్రయోగం సక్సెస్

ABN , First Publish Date - 2021-07-21T23:04:15+05:30 IST

ఆత్మనిర్భర్ భారత్‌ సాధించే దిశగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. శత్రుదేశ ట్యాంకులను తుత్తునీయలు చేసే ఎమ్‌పీఏటీజీఎమ్(మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది.

Anti tank guided missile: DRDO ప్రయోగం సక్సెస్

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్‌ సాధించే దిశగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. శత్రుదేశ యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ఎమ్‌పీఏటీజీఎమ్(మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం  విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. సమీపంలోని లక్ష్యాలను క్షిపణి కచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని పేర్కొన్నాయి. ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డీఆర్‌డీఓ పేర్కొంది. 

Updated Date - 2021-07-21T23:04:15+05:30 IST