అక్బర్‌ కల!

ABN , First Publish Date - 2020-05-20T05:30:00+05:30 IST

ఒకరాత్రి అక్బర్‌ మహారాజుకు ఒక కల వచ్చింది. తన దంతాలన్నీ ఊడిపోయినట్టుగా, ఒక్కటి మాత్రమే మిగిలినట్టుగా కల వచ్చింది. దాని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని రాజ్యంలో ఉన్న జ్యోతిష్యులందరినీ...

అక్బర్‌ కల!

ఒకరాత్రి అక్బర్‌ మహారాజుకు ఒక కల వచ్చింది. తన దంతాలన్నీ ఊడిపోయినట్టుగా, ఒక్కటి మాత్రమే మిగిలినట్టుగా కల వచ్చింది. దాని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని రాజ్యంలో ఉన్న జ్యోతిష్యులందరినీ పిలిపించాడు. తనకు వచ్చిన కలను వివరించి దాని అర్థం ఏంటో చెప్పాలని ఆజ్ఞాపించాడు. బాగా ఆలోచించిన జ్యోతిష్యులు మీకన్నా ముందుగా మీ బంధువులందరూ చనిపోతారని రాజుకు వివరించారు. అది విన్న రాజు బాగా కలత చెందాడు. జ్యోతిష్యులకు ఎలాంటి బహుమతులు ఇవ్వకుండానే పంపించాడు. మరుసటి రోజు సభకు బీర్బల్‌ వచ్చాడు. రాజు బీర్బల్‌కు విషయం చెప్పి ఆ కల అర్థమేంటో చెప్పమన్నాడు. కాసేపు ఆలోచించిన బీర్బల్‌ ‘‘జహాపనా! మీరు ఎక్కువ కాలం జీవిస్తారు. మీ బంధువుల కన్నా మిన్నగా సంపూర్ణమైన జీవితం అనుభవిస్తారు’’ అని చెప్పాడు. బీర్బల్‌ వివరణతో సంతోషించిన ఆక్బర్‌ ఆయనకు బహుమతులు ఇచ్చి సత్కరించాడు.

Updated Date - 2020-05-20T05:30:00+05:30 IST