డ్రింక్‌ ఏ మేరకు సేఫ్‌..?

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

వేసవిలో బీరు సేవించొచ్చా? బీరు తాగితే పొట్ట వస్తుందంటారు కదా... అలాంటప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఏమేరకు ఇది సేఫ్‌? బీరులో ...

డ్రింక్‌ ఏ మేరకు సేఫ్‌..?

వేసవిలో బీరు సేవించొచ్చా? బీరు తాగితే పొట్ట వస్తుందంటారు కదా... అలాంటప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఏమేరకు ఇది సేఫ్‌? బీరులో చాలా షుగర్‌ ఉంటుందని విన్నాను. మధుమేహం ఉన్నవారు, పీసీఓడీ ఉన్నవారు తీసుకుంటే ప్రమాదమా?

మోనికా, సికింద్రాబాద్‌


మీరు ఒక్క ప్రశ్నలోనే ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆల్కహాల్‌ పరిమితిలో ఉంటేనే ఆరోగ్యాన్నిస్తుంది. పరిమితి దాటితే దెబ్బ తీస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది కదాని కొత్తగా మొదలుపెట్టాల్సిన పనిలేదు. బీరు గురించి కొన్ని విషయాలు మీకు తెలిస్తే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. బార్లీ లేదా గోధుమ గింజలు, స్పైసెస్‌, ఈస్ట్‌ (బ్యాక్టీరియా) నీరు కలిపి ప్రాసెస్‌ చేయడం వల్ల బీరు తయారువుతుంది. బీరు తయారీ ముఖ్యంగా ఐదు విధానాల్లో ఉంటుంది. 1. మల్టింగ్‌.. ఇక్కడ గింజలు మొలకెత్తిస్తారు. దీనివల్ల పిండిపదార్థం మాల్టోజ్‌ షుగర్‌గా మారుతుంది. 2. మాషింగ్‌... ఇక్కడ వోర్ట్‌ అనే లిక్విడ్‌ రెడీ అవుతుంది. 3. బాయిలింగ్‌... ఇక్కడ స్పైసెస్‌ కలిపి లిక్విడ్‌ను ఫిల్టర్‌ చేస్తారు. 4. ఫెర్మెంటేషన్‌... ఇక్కడ ఈస్ట్‌ కలుపుతారు. ఇక్కడే షుగర్‌ కాస్త ఆల్కహాల్‌గా మారుతుంది. 5. మెచురేషన్‌... ఈ విధానం ద్వారా రెడీ అవుతుంది. కాబట్టి సింపుల్‌గా బీరులో 80 శాతం షుగర్స్‌ ఉంటాయి. మిగిలిన 20 శాతం కొద్దిగా కాంప్లెక్స్‌ షుగర్స్‌ ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి కావడానికి ఉపయోగపడతాయి.


రెగ్యులర్‌ బీరులో 13 గ్రాములు పిండి పదార్థం, జీరో షుగర్‌ ఉంటుంది. లైట్‌ బీరులో 6 గ్రాముల దాకా పిండిపదార్థం, 0.5 గ్రాముల షుగర్‌ ఉంటుంది. నాన్‌ ఆల్కహాలిక్‌ బీరులో 28 గ్రాముల పిండి పదార్థం, 28 గ్రాముల దాకా షుగర్‌ ఉంటుంది. 


మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్‌ తగ్గుతుంది. అంటే హైపో గ్లిసేమియా వస్తుంది. అందుకే ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు కొద్దిగా పిండిపదార్థం కూడా తినాలి. మధుమేహం ఉన్నవారు స్టాండర్డ్‌ డ్రింక్‌ మాత్రమే తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తులు రెండు స్టాండర్డ్స్‌ డ్రింక్స్‌ కన్నా ఎక్కువ తీసుకోరాదు. ఇక బీర్‌ తాగితే పొట్ట వచ్చే ప్రమాదం ఉంది. ఇది కేవలం బీరు తాగడం వల్ల కాదు... దానితో పాటు తినే స్నాక్స్‌ వల్ల ఎక్కువ క్యాలరీలు చేరతాయి. అందుకే స్నాక్స్‌, బీరు రెండూ లిమిట్‌ చేయాలి. పొట్ట పెరగడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశముంది. అందుకే ఆల్కహాల్‌ విషయంలో లిమిట్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST