Abn logo
Aug 1 2021 @ 23:25PM

చిన్నబల్లిపుట్టుగలో తాగునీటి కష్టాలు

నిరసన తెలుపుతున్న మహిళలు

 20 రోజులుగా సరఫరా కాని ‘ఉద్దానం’ నీరు  ఫ మహిళల నిరసన

 కవిటి: చిన్నబల్లిపుట్టుగ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. 20రోజులుగా ఉద్దానం పథకం నుంచి తా గునీరు సరఫరా కాకపోవ డంతో గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఉద్దానం నీటి ట్యాంక్‌ వద్ద ఖాళీ బిందెలతో ఆదివారం గ్రామ మ హిళలు నిరసన తెలిపారు. గ్రామంలో 20 రోజులుగా తాగునీరు లేక అల్లాడిపోతున్నామని, తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈసందర్భంగా మహిళలు కుమారిదొళై, నీలిబిసాయి, రోజా తదితరులు మాట్లాడుతూ ఉద్దానం నీటిపథకం ద్వారా నీరు రాకపోవడంతో అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కాలువ పనులకోసం తవ్వడం వల్ల పైపులైన్లు లీకులయ్యాయని, ఈ విషయంపై ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.