మేలు... మంచినీళ్లు!

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీళ్లతో దాహం తీరడంతో పాటు వేళ కాని వేళలో తినాలనే కోరికలు కూడా కట్టడి అవుతాయి. అంతే కాదు....

మేలు... మంచినీళ్లు!

నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీళ్లతో దాహం తీరడంతో పాటు వేళ కాని వేళలో తినాలనే కోరికలు కూడా కట్టడి అవుతాయి. అంతే కాదు....



  1. భోజనానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే ఆకలి తగ్గి, పరిమితంగా భోజనం ముగిస్తాం. దాంతో అదనపు కేలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.
  2. నిద్ర లేచిన వెంటనే లేదా ఉదయం అల్పాహారానికి ముందు నీళ్లు తాగే అలవాటు ఉన్న వాళ్లు, ఆ అలవాటు లేని వారి కంటే 44ు ఎక్కువగా అధిక శరీర బరువు కోల్పోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది.
  3. రోజులో తాగే అర లీటరు నుంచి ఒక లీటరు నీళ్ల ద్వారా విశ్రాంతి దశలో సైతం శక్తి ఖర్చవుతూ ఉంటుంది. 
  4. శీతల పానీయాలకు నీళ్లు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. సున్నా కేలరీలతో కూడిన నీళ్లతో దాహం తీర్చుకుంటే, ఇతరత్రా వేసవి పానీయాల ద్వారా శరీరంలోకి చేరే కేలరీలను నియంత్రించుకోవచ్చు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST