కాంట్రాక్టర్‌ నిర్వాకం.. తాగునీటికి కష్టం..

ABN , First Publish Date - 2020-07-06T10:31:05+05:30 IST

ఒంగోలు నగరంలో పలు కా లనీల్లో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పలు ప్రాం తాల్లో ఏళ్ళ నాటి తాగునీటి పైపులైనులు ..

కాంట్రాక్టర్‌ నిర్వాకం.. తాగునీటికి కష్టం..

ఒంగోలు (కార్పొరేషన్‌) జూలై 5 : ఒంగోలు నగరంలో పలు కా లనీల్లో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పలు ప్రాం తాల్లో ఏళ్ళ నాటి తాగునీటి పైపులైనులు ఉండగా, వాటి స్థానంలో కొత్తవాటిని మార్పుచేసేందుకు, అదేవిధంగా లీకుల మరమ్మతుల ను కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అయితే కాం ట్రాక్టర్‌ నిర్వాకంతో కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి.


గాంధీనగ ర్‌లో వారం క్రితం మరమ్మతుల కోసం గుంత తవ్వి అలాగే వది లేయగా, స్థానిక లాయరుపేటలోని టంగుటూరి ప్రకాశంపంతులు విగ్రహం వద్ద పెద్దగుంత తీశారు. ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఎదుటపైపులైను జాయింట్‌ కోసం ఎక్స్‌కవేటర్‌తో గుంత తీసే సమయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పైపులు పగిలిపోయాయి. అయి తే నగరంలో అధిక చోట్ల రోడ్లను తవ్వి పనులు పూర్తి చేయ కు ండా వదిలేయడంతో ట్రాఫిక్‌ సమస్యతో పాటు, వర్షం వస్తే బు రద సమస్య, మరోవైపు తాగునీటి సరఫరాకు రోజుల తరబడి ఆ టంకాలు ఎదురవుతున్నాయి. అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో నగర ప్రజలకు తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. 

Updated Date - 2020-07-06T10:31:05+05:30 IST