Abn logo
May 21 2020 @ 11:50AM

తెర పైకి `దృశ్యం` సీక్వెల్!

మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన మలయాళ చిత్రం `దృశ్యం`. 2103లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కుటుంబ బంధాలు, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళం మొదలైన భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. 


అంతేకాదు చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ తాజాగా ప్రకటించారు. మొదటి భాగంలో భార్యాభర్తలుగా కనిపించిన మోహన్ లాల్, మీనా  ఈ సీక్వెల్‌లోనూ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారట. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని జీతూ ప్రకటించారు. 

Advertisement
Advertisement
Advertisement