పీవీటీజీ స్కూళ్లలో అడ్మిషన్లకు డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-08-02T08:05:44+05:30 IST

ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ చర్యలు ప్రారంభించింది.

పీవీటీజీ స్కూళ్లలో అడ్మిషన్లకు డ్రైవ్‌

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 10 పీవీటీజీ స్కూళ్లలో సుమారు 640 మంది విద్యార్థులు చదువుకునే అవకాశముంది. అవగాహన లేకపోవడం, పీవీటీజీలకు కోసం ప్రత్యేకంగా పాఠశాలలున్నాయని తెలియకపోవడంతో అడ్మిషన్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో సొసైటీ కార్యదర్శి కె.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అడ్మిషన్ల కోసం డ్రైవ్‌ నిర్వహించారు. టీచర్లు, ప్రిన్సిపాళ్లను బృందాలుగా ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.    

Updated Date - 2021-08-02T08:05:44+05:30 IST