డ్రైవర్ లేకుండా వెళ్తూ.. అదుపు తప్పి చెట్టును గుద్దేసిన టెస్లా కారు.. ఇద్దరు మృతి!

ABN , First Publish Date - 2021-04-20T11:24:59+05:30 IST

డ్రైవర్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుద్దుకొని ఇద్దరు మరణించిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది.

డ్రైవర్ లేకుండా వెళ్తూ.. అదుపు తప్పి చెట్టును గుద్దేసిన టెస్లా కారు.. ఇద్దరు మృతి!

టెక్సాస్: డ్రైవర్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుద్దుకొని ఇద్దరు మరణించిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌కు చెందిన ఇద్దరు టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. కారును సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌లో పెట్టి వాళ్లు ప్రయాణిస్తుండగా.. రోడ్డుపై మలుపు వచ్చింది. ఆ సమయంలో అక్కడ మలుపు తిరగడంలో కారు కంప్యూటర్ వ్యవస్థ విఫలమైంది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఆ కారు బలంగా ఢీకొంది.


ఈ ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తి డ్రైవర్ సీటు పక్కనే ఉండే ఫ్రంట్ సీటులో ఉండగా, మరో వ్యక్తి వెనుక సీటులో ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కారు వేగంగా ప్రయాణిస్తూ మలుపు తిరగడంలో విఫలమైందని, ఆపై చెట్టుకు ఢీకొని తగలబడిపోయి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు.

Updated Date - 2021-04-20T11:24:59+05:30 IST