డ్రైవర్‌ నిజాయితీ

ABN , First Publish Date - 2020-12-05T05:28:12+05:30 IST

కర్నూలులో జీపు డైవర్‌ తిమ్మప్ప తనకు దొరికిన ఓ పర్సును శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు.

డ్రైవర్‌ నిజాయితీ

ప్యాపిలి, డిసెంబరు 4: కర్నూలులో  జీపు డైవర్‌ తిమ్మప్ప తనకు దొరికిన ఓ పర్సును శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు.  ప్యాపిలికి చెందిన తిమ్మప్ప జీపు డ్రైవర్‌గా   జీవనం సాగిస్తున్నాడు.   రోజూ ప్యాపిలి నుంచి కర్నూలుకు ప్రయాణికులను తరలిస్తుంటాడు. శుక్రవారం కూడా ప్రయాణికులను ఎక్కించుకొని కర్నూలు రాజ్‌విహార్‌ సెంటర్‌లో దింపారు. ఆ సమయంలో అక్కడ తిమ్మప్పకు ఓ పర్సు దొరికింది. దానిని డ్రైవర్‌ స్థానిక ఎస్‌ఐ మారుతి శంకర్‌కు అప్పజెప్పారు. పర్స్‌లో రూ.4వేలు నగదుతోపాటు ఏటీఎం, పాన్‌ కార్డు ఉన్నాయి. వాటి ఆధారంగా పోగొట్టుకున్న పర్స్‌ బేతంచెర్ల మండలం ముద్దవరానికి చెందిన మధుగా గుర్తించిన పోలీసులు అతనికి ఫోన్‌ చేశారు. బాధితుడు పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ మారుతి శంకర్‌, డ్రైవర్‌ తిమ్మప్ప చేతుల మీదుగా పర్సును తీసుకున్నాడు. డ్రైవర్‌ నిజాయితీని పలువురు ప్రశంసించారు.

Updated Date - 2020-12-05T05:28:12+05:30 IST