ఆ రెండు రాష్ట్రాల డ్రైవర్లపై కర్ణాటక ఆంక్షలు

ABN , First Publish Date - 2021-03-08T02:50:19+05:30 IST

నుంచి వచ్చే కమర్షియల్, గూడ్స్ వాహనాల డ్రైవర్లు, కండక్టర్లపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో

ఆ రెండు రాష్ట్రాల డ్రైవర్లపై కర్ణాటక ఆంక్షలు

బెంగళూరు: మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే కమర్షియల్, గూడ్స్ వాహనాల డ్రైవర్లు, కండక్టర్లపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు వారు తమకు కరోనా లేదని ధ్రువీకరించే ఆర్టీ-పీసీఆర్ కొవిడ్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా ఆరు రాష్ట్రాల్లో రోజు వారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో ఆదివారం 580 కొత్త కేసులు నమోదు కాగా, ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,54,393 పెరిగింది. 12,359 మంది మృత్యువాత పడ్డారు. అలాగే, 355 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,35,421 చేరింది. 

Updated Date - 2021-03-08T02:50:19+05:30 IST