సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి... 8మందికి గాయాలు...

ABN , First Publish Date - 2021-08-31T22:14:38+05:30 IST

సౌదీ అరేబియాలో ఓ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగినట్లు

సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి... 8మందికి గాయాలు...

న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో ఓ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా మంగళవారం వెల్లడించింది. నైరుతి సౌదీ అరేబియాలో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడినట్లు, ఓ విమానం దెబ్బతిన్నట్లు తెలిపింది. గడచిన 24 గంటల్లో ఇది రెండో దాడి అని వివరించింది. 


సౌదీ అరేబియా మీడియా కథనాల ప్రకారం, అభా విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఇది గడచిన 24 గంటల్లో జరిగిన రెండో దాడి. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఏ సంస్థా ప్రకటించలేదు. సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి ఈ దాడులపై ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ప్రాణహాని, గాయపడినవారి పరిస్థితుల గురించి కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే పేలుడు పదార్థాలతో వచ్చిన డ్రోన్‌ను అడ్డుకున్నట్లు మాత్రమే తెలిపింది. 


యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమితో పోరాడుతున్నారు. సైనిక స్థావరాలు, చమురు ఉత్పత్తి సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయాలపై దాడులు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-31T22:14:38+05:30 IST