అసాంఘిక కార్యకలాపాలపై ‘డ్రోన్‌’ నిఘా

ABN , First Publish Date - 2021-10-13T05:32:04+05:30 IST

అసాంఘిక కార్యకలాపాలపై ‘డ్రోన్‌’ నిఘా

అసాంఘిక కార్యకలాపాలపై ‘డ్రోన్‌’ నిఘా

ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

కృష్ణకాలనీ, అక్టోబరు 12: పండుగ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు. భూపాలపల్లిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం, సిగరేట్‌  తాగడం, దురుసుగా వాహనాల నడపడంపై డ్రోన్‌ కెమెరాల ద్వారా కన్నేశారు. డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో సీఐ వాసుదేవరావు, ఎస్సై అభివన్‌ ఈ మేరకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గస్తీ చేస్తున్నారు. 2.5 కిలో మీటర్ల దూరంలో 500 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్‌ కెమెరా పనిచేస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు కానరావడంతోనే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-13T05:32:04+05:30 IST