అక్కడ కుక్కల కోసం Dronesతో ఆహారం

ABN , First Publish Date - 2021-10-14T15:20:39+05:30 IST

స్పెయిన్‌ దేశంలో అగ్నిపర్వతం పేలుడు కారణంగా లావా వెలువడటంతో కుక్కలకు డ్రోన్స్ ద్వారా ఆహారం, నీరు అందించారు...

అక్కడ కుక్కల కోసం Dronesతో ఆహారం

లా పాల్మా (స్పెయిన్): స్పెయిన్‌ దేశంలో అగ్నిపర్వతం పేలుడు కారణంగా లావా వెలువడటంతో కుక్కలకు డ్రోన్స్ ద్వారా ఆహారం, నీరు అందించారు. స్పానిష్ ద్వీపమైన లా పాల్మాలోని టోడోక్ పర్వత ప్రాంతంలో అగ్నిపర్వతం నుంచి లావా వెలువడుతోంది.అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావాతో గోడలు బూడిదతో నిండిపోయాయి.దీంతో ఈ ప్రాంత యార్డ్‌లో ఉన్న కుక్కల కోసం ఆకాశంలో డ్రోన్ ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నారు.గత ఐదు రోజులుగా కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించినందుకు టికామ్ సొల్యూసియోన్స్, వోల్కానిక్ లైఫ్‌ అనే రెండు సంస్థలకు లా పాల్మా ద్వీపం కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది.


లావా నుంచి వెలువడుతున్న వేడి గాలి, అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా ఈ ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగరలేవు. హెలికాప్టరు రోటర్లు వేడిగాలి వల్ల దెబ్బతినే అవకాశముండటంతో అగ్నిపర్వత ప్రాంతంలోని కుక్కులకు ఆహారాన్ని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు.లా పాల్మాలో అగ్నిపర్వతం పేలుడు సంభవించాక పాఠశాల ఆటస్థలంలో తాత్కాలికంగా జంతువుల ఆశ్రయం ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 19వతేదీన కుంబ్రేవీజా అగ్నిపర్వతం పేలినపుడు వందలాది కుక్కలు, ఇతర జంతువులకు ఆశ్రయం లేకుండా పోయింది.లావా ప్రవాహంతో 1200 భవనాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. 

Updated Date - 2021-10-14T15:20:39+05:30 IST