Advertisement

Katrina వెడ్డింగ్ : కనిపిస్తే కూల్చేస్తారట!

డిసెంబర్ 9న పెళ్లి! అయినా ఇంత వరకూ వధువుగానీ, వరుడుగానీ నోరు విప్పలేదు! ‘మేం పెళ్లి చేసుకుంటున్నాం’ అంటూ నిర్ధారించలేదు! అయినా బాలీవుడ్‌లో ఇప్పుడు ఎటు చూసినా క్యాట్ వెడ్స్ విక్కీ కౌశల్ హడావిడే. తాజాగా మరో పుకారు ముంబైలో షికారు చేస్తోంది... 


విక్కీ కౌశల్, కత్రీనా గ్రాండ్ వెడ్డింగ్ రాజస్థాన్‌లో జరగబోతోంది. ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా’ హోటల్‌లో జరగనున్న ఈవెంట్ ఆప్ ద ఇయర్‌కి బాలీవుడ్ ప్రముఖులు ఎలాగూ వస్తారు. మరికొందరు వీవీఐపీలు కూడా హాజరవుతారని సమాచారం. కాకపోతే, ఎవ్వరు వచ్చినా బయటకు ఫోటోలు, వీడియోలు లీక్ కావటానికి వీల్లేదని రూల్ విధించారట. అతిథులు ఎవ్వరూ సెల్‌ఫోన్లు కూడా లోనికి తీసుకు వెళ్లరని సమాచారం. అయితే, ఇప్పుడు ఇంకో మాట కూడా వినిపిస్తోంది. ఎవరైనా డ్రోన్స్ ద్వారా పెళ్లి వేదికని కెమెరాలో బందించే ఛాన్స్ ఉండటంతో ఆ దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పెళ్లి జరిగే పరిసరాల్లో డ్రోన్ కనిపిస్తే ఇమ్మీడియెట్‌గా కాల్చేస్తారట. తుపాకులతో నేల కూలుస్తారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు!


సినిమా సెలబ్రిటీల పెళ్లిల్లు అంటేనే బోలెడు క్రేజ్ ఉంటుంది. ఇక కత్రీనా లాంటి టాప్ బ్యూటీ వివాహం అంటే మరిన్ని పుకార్లు పుడుతుంటాయి. ఈ డ్రోన్స్‌ను కూల్చివేసే వార్త కూడా అటువంటిదే అయ్యి ఉండాలి. లేదంటే నిజంగానే వీడియోలు, ఫోటోలు లీక్ కావద్దని విక్కీ, క్యాట్ తీవ్రమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవచ్చు కూడా... 

Advertisement

Bollywoodమరిన్ని...