Abn logo
May 23 2021 @ 08:43AM

ఒమ‌న్‌లో త‌గ్గిన ప‌నిచేస్తున్న వ‌ల‌స‌దారుల సంఖ్య‌!

మ‌స్క‌ట్‌: ఒమ‌న్‌లో ప‌నిచేస్తున్న వ‌ల‌దారుల సంఖ్య త‌గ్గుతుందా అంటే అవున‌నే చెబుతున్నాయి తాజాగా వెలువ‌డిన గ‌ణాంకాలు. మార్చి నెల‌లో నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్(ఎన్‌సీఎస్ఐ) విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం ఒమ‌న్‌లో ప‌నిచేస్తున్న వ‌ల‌స‌దారుల సంఖ్య‌లో 13 శాతం త‌గ్గింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సెక్టార్‌ల‌లో క‌లిపి సుమారు 2 ల‌క్ష‌ల 18వేల మంది వ‌ల‌స‌దారులు సుల్తానేట్‌ను విడిన‌ట్లు ఎన్‌సీఎస్ఐ నివేదిక చెబుతోంది. ఇది 13 శాతానికి స‌మానం అని పేర్కొంది. 

తాజా వార్తలుమరిన్ని...