డ్రాపౌట్స్‌ను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-07-31T05:33:28+05:30 IST

జిల్లాలో డ్రాపౌట్స్‌ను గుర్తించి వారిని పాఠశాలలకు పంపిం చే ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గూడూరు రామకృష్ణ తెలిపారు.

డ్రాపౌట్స్‌ను గుర్తించాలి
సోంపేటలో ర్యాలీ చేస్తున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది


గుజరాతీపేట: జిల్లాలో డ్రాపౌట్స్‌ను గుర్తించి వారిని పాఠశాలలకు పంపిం చే ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ గూడూరు రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా స్థానిక జిల్లా కోర్టు భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా అక్రమంగా రవాణా చేయకుండా కాపా డాలన్నారు. చట్టాలపై అవగాహనతో ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశా లు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు జరిగేటప్పుడు వెళ్లి ఆపేకంటే.. ముందుగా ప్రజ లకు బాలల చట్టాలను తెలియజేసి చైతన్యపర్చడం వల్ల ఇటువంటి దురాచారాలను రూపు మాపే అవకాశం ఉందన్నారు.  అనంతరం చైల్డ్‌లైన్‌ సంస్థ రూ పొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.  జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, చైల్డ్‌లైన్‌ నోడల్‌ అధికారి సింహాచలం, హేమలత, ఎస్‌.వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. ఫఇచ్ఛాపురం: బాలలు, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవాలని చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ జాస్మిన్‌కుమారి కోరారు. శుక్రవారం ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని నాలుగు, ఐదు వార్డుల్లో ప్రపంచ బాలల అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీలు నిర్వహిం చారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ సిబ్బంది సుధీర్‌, రాజేశ్వరి, నందిని  పాల్గొన్నారు.  ఫసోంపేట:ఇసుకలపాలెంలో శుక్రవారం ప్రపంచ బాలల అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో  చైల్డ్‌లైన్‌ ప్రతినిధి కృష్ణబాబు, సంతోష్‌  పాల్గొన్నారు. 



 


 


Updated Date - 2021-07-31T05:33:28+05:30 IST