Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా సమస్యలపై పట్టింపు కరువు

-సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు రవికుమార్‌
కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్‌ అన్నారు.  కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సీపీఎం పట్టణ 2వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రగల్భాలు పలికిందని, ప్రస్తుతం దాని ఊసే లేదని విమర్శించారు. అలాగే అనేక చట్టాలను మారుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడి బతుకు భారంగా మార్చిందన్నారు. మరో వైపు రైతుల సమస్యలను సైతం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం విధానాలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక ఎస్పీఎంలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. దీనిపై పట్టించుకునే వారే లేకుండా పోయారని తెలిపారు.  సమావేశానికి ముందు పార్టీ జెండా ఎగురువేశారు. అనంతరం పట్టణ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు కుమార్‌, శంకర్‌, సాయి, సంజీవ్‌, గిరికుమార్‌, మహేశ్‌, అనిత, దస్తగిరి, జాడి మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement