Advertisement

సుశాంత్ కేసులో డ్ర‌గ్స్ వ్యాపారి అరెస్ట్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కేసుని ద‌ర్యాప్తు చేసిన సీబీఐ అధికారుల వ‌ల్ల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి నార్కోటిక్ అధికారులు ఈ కేసులో అనుమానితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ప‌లువురు సినీ సెల‌బ్రిటీల‌ను విచారించిన నార్కోటిక్ అధికారులు రీసెంట్‌గా సుశాంత్ పి.ఆర్ మేనేజ‌ర్ సిద్ధార్థ్ పితానీని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ ఇంట్లో పని చేసే నీర‌జ్, కేశ‌వ్‌ల‌ను కూడా అధికారులు విచారించారు. ఇప్పుడు డ్ర‌గ్స్ డీల‌ర్ హరీశ్ ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. సిద్ధార్థ్ చేసిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఈ డ్ర‌గ్స్ వ్యాపారి హ‌రీశ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మ‌రోవైపు సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు తీయ‌డం ఆపేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటే ఆయ‌న తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుని హైకోర్టు రిజ‌ర్వ్‌లో ఉంచింది. 

Advertisement

Bollywoodమరిన్ని...