డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న నార్కోటిక్ అధికారుల దర్యాప్తు

ABN , First Publish Date - 2021-04-18T17:19:40+05:30 IST

డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధుల లింక్‌ల‌పై ఎన్‌సీబీ ఆధారాలు సేకరిస్తోంది.

డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న నార్కోటిక్ అధికారుల దర్యాప్తు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధుల లింక్‌ల‌పై ఎన్‌సీబీ ఆధారాలు సేకరిస్తోంది. 2020 నుంచి కర్ణాటక, తెలంగాణలో మొత్తం ఎన్‌సీబీ 36 కేసులు నమోదు చేసింది. 15 నెలల్లో 49 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. పట్టు బడిన వారిలో 11 మంది హైదరాబాదీలు ఉన్నారు. 15 నెలల్లో 4 వేల కేజీల గంజాయితో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. అరెస్టుచేసిన వారిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువ. డీ అనికా అనే యువతి అరెస్టుతో సౌత్‌లో డొంక కదిలింది. దుబాయి ఖతార్ నుంచే డ్రగ్స్‌ను పార్శిల్ ద్వారా దిగుమతి చేస్తునట్టు ఎన్‌సీబీ గుర్తించింది. హైదరాబాద్‌లోని వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధుల డ్రగ్స్ లింకులపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీసుల ఎదుట పలువురు వ్యాపారస్తులు విచారణకు హాజరయ్యారు.

Updated Date - 2021-04-18T17:19:40+05:30 IST