డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

ABN , First Publish Date - 2022-01-22T01:40:42+05:30 IST

డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉండగా, 10 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు టోనీతో పాటు ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. 2009లో టోనీ ముంబైకి వచ్చాడని, వ్యాపార నిమిత్తం నైజీరియన్ టోనీ ముంబైకి వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ స్టార్ బాయ్‌తో టోనీకి పరిచయం ఉందని, 2013 నుంచి టోనీ డ్రగ్స్ మాఫియా నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. 60 మంది యువకులతో టోనీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-22T01:40:42+05:30 IST