షారూఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ పంచదార అవుతుంది: బీజేపీపై మహా మంత్రి ఫైర్

ABN , First Publish Date - 2021-10-24T16:32:52+05:30 IST

డ్రగ్స్ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ దొరికిన విషయాన్ని చాగన్ ప్రస్తావిస్తూ క్రూజ్ షిప్‌పైనే ఎన్సీబీ ఎందుకు దృష్టి పెట్టిందని ప్రశ్నించారు..

షారూఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ పంచదార అవుతుంది: బీజేపీపై మహా మంత్రి ఫైర్

ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ అవుతుందని భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛాగన్ బుజ్బ్‌పాల్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డ్రగ్స్ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ దొరికిన విషయాన్ని చాగన్ ప్రస్తావిస్తూ క్రూజ్ షిప్‌పైనే ఎన్సీబీ ఎందుకు దృష్టి పెట్టిందని ప్రశ్నించారు.


‘‘వందల, వేల కిలోల డ్రగ్స్ బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే ఎన్సీబీ ఒక్క ముంబైనే టార్గెట్ చేసింది. క్రూజ్ షిప్‌లో దొరికిన డ్రగ్స్ చాలా తక్కువ. కాకపోతే దీనిపై దృష్టి సారించడం కక్షపూరితమే. ఒకవేళ షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరితే ముంబైలోని డ్రగ్స్ పంచదార పౌడర్ అయిపోతాయి కూడా’’ అని ఛాగన్ బుజ్బ్‌పాల్ అన్నారు.

Updated Date - 2021-10-24T16:32:52+05:30 IST