వెదజల్లే పద్ధతిలో సాగు శ్రేయస్కరం

ABN , First Publish Date - 2021-02-24T04:51:10+05:30 IST

జిల్లావ్యాప్తంగా నేరుగా వరివిత్తే విధానం ఆశాజనకంగా ఉందని వరి పరిశోధన సౌథం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పీ.రఘురామ్‌రెడ్డి, డాక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ, డాక్టర్‌ పీ.కిరణ్‌బాబు అన్నారు.

వెదజల్లే పద్ధతిలో సాగు శ్రేయస్కరం
వ్యవసాయక్షేత్రంలో రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు

 జిల్లాలో ఆశాజనకంగా వర్తివిత్తే విధానం

 వరి పరిశోధన సౌథం ప్రధాన శాస్త్రవేత్తలు

సత్తుపల్లి/తల్లాడ ఫిబ్రవరి 23: జిల్లావ్యాప్తంగా నేరుగా వరివిత్తే విధానం ఆశాజనకంగా ఉందని వరి పరిశోధన సౌథం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పీ.రఘురామ్‌రెడ్డి, డాక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ, డాక్టర్‌ పీ.కిరణ్‌బాబు అన్నారు. మంగళవారం నేరుగా వరి విత్తేవిధానంలో సాగవుతున్న వ్యవసాయక్షేత్రాలను జిల్లాలో పలుప్రాంతాల్లో పరిశీలించారు. మండలంలోని తాళ్లమడ గ్రామంలో పర్యటించిన శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ జిల్లాలో 30వేల ఎకరాలలో ఈ విధానాన్ని రైతులు అవలంభిస్తున్నారన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖీలో పంటసాగు, సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రం సమన్యయకర్త డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌, ఏడీఏ ఉల్లోజు నరసింహారావు, శాస్త్రవేత్త డాక్టర్‌ కే.రవికుఆర్‌, ఏవోలు వై.శ్రీనివాసరావు, తాజుద్దీన్‌, రూప, ఏఈవోలు కే.ఆశాజ్యోతి, రైతులు వై.తిరుమలరావు, సంపత్‌, వీ.లక్ష్మీనారాయణ, ఎన్‌.సత్యనారాయణ, ఎన్‌.జగన్మోహనరావు, ఏ.శ్రీనివాసరావు, ఎం.వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ: వెదజల్లే పద్దతిలో వరిసాగు శ్రేయస్కరమని వ్యవసాయశాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. మంగళవారం తల్లాడ మండలం కొత్తవెంకటగిరి, వెంగన్నపేట గ్రామాల్లో హైదరాబాద్‌ వరిపరిశోధనాస్థానం, వైరా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం వెదజల్లే పద్దతిలో సాగుచేసిన వరిపైర్లను పరిశీలించారు. ఏఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం వెదజల్లే పద్దతిలో వరిసాగుచేసిన రైతుల అనుభవాలు, ఎరువులు, పురుగుమందుల వాడకం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు వెదజల్లే పద్దతిలో సాగుచేసిన వరిలో కలుపు గురించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ వరిలో కలుపు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కిరణ్‌బాబు, డాక్టర్‌ హేమంతకుమార్‌, ఏడీఏ యు.నర్సింహారావు, ఏవో ఎండీ.తాజుద్దీన్‌, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T04:51:10+05:30 IST