ఫుల్లుగా తాగేశారు...

ABN , First Publish Date - 2021-04-20T05:13:13+05:30 IST

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొవిడ్‌-19 కారణంగా అన్ని రంగాలు అతలాకుతలమై ఆటుపోట్లను ఎదుర్కొంటే మద్యం అమ్మకాల్లో మా త్రం దూసుకుపోతున్నది.

ఫుల్లుగా తాగేశారు...

 ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు....

 ఏడాదిలో రూ.2,938 కోట్లు

 రోజుకు రూ.8.16 కోట్ల అమ్మకాలు, నెలకు రూ.245 కోట్లు

 ఎక్సైజ్‌శాఖపై పడని కరోనా ప్రభావం 

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 19 : కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొవిడ్‌-19 కారణంగా అన్ని రంగాలు అతలాకుతలమై ఆటుపోట్లను ఎదుర్కొంటే మద్యం అమ్మకాల్లో మా త్రం దూసుకుపోతున్నది. రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలతో మం దుబాబులు వెచ్చిస్తున్న డబ్బు సర్కార్‌కు ప్రధాన ఆదాయవనరుగా మా రింది. యేటా కోట్లాది రూపాయలు ప్రజలు తాగుడుపై వెచ్చిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వానికి వైన్‌, బార్‌షాపుల యజమానులకు ఆ సొమ్ము వరం గా మారింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2021 మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరంలో 2,938 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 

ఇందులో రూ.2,448 కోట్లు  మద్యం అమ్మకాలు కాగా రూ.490 కోట్లు మద్యం వ్యాపారులకు కమీషన్‌గా సమకూరింది. ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకో వడానికి తరచు గా మద్యం ధరలను, మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజుతోపాటు వివిధ పన్నులను పెంచుతూ పోతున్నది. మద్యం అమ్మకాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 2019 నుంచి 2020 మార్చి)లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 2,038 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగగా మరో 400 కోట్ల వరకు మద్యం వ్యాపారులకు కమీషన్‌గా ఆదా యం సమకూరింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.410 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా 6 నెలలపాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు మూసివేయగా, 45 రోజుల పాటు వైన్‌ షాపులు కూడా మూసి ఉన్నా యి. అయినప్పటికీ అమ్మకాలు పెరగ డం గమనార్హం. లాక్‌డౌన్‌ సమయంలో వైన్‌ షాపులు, బార్‌లలో ఉన్న మద్యం స్టాక్‌ను కొందరు వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తర లించి అక్ర మంగా అమ్మకాలు సాగించారు. అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ చూసీచూడన ట్లుగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. లాక్‌ డౌన్‌ తో మద్యం షాపులు మూసివేసిన కాలానికి లైసెన్స్‌ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. 

మూడు మద్యం డిపోల నుంచి మద్యం సరఫరా...

కరీంనగర్‌, మంచిర్యాల, సిద్దిపేట మద్యం డిపోల నుంచి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని 266 వైన్‌షాపులు, 66 బార్‌ అండ్‌రెస్టారెంట్‌లకు మద్యం సరఫరా అవుతున్నది. కరీంనగర్‌ జిల్లాలోని 87 వైన్‌షాపులు, 29 బార్‌లకు కరీంనగర్‌ మద్యం డిపో నుంచి సరఫరా అవుతుండగా, సిరిసిల్ల జిల్లాలోని 41 వైన్‌షాపులు, 7 బార్‌లకు సిద్ధిపేట మద్యం డిపో నుంచి సరఫరా అవుతున్నది, పెద్దపల్లి జిల్లాలోని 74 వైన్‌షాపులు, 14 బార్‌లకు, జగిత్యాల జిల్లాలోని 64 వైన్‌షాపులు, 16 బార్‌లలో సగానికిపైగా కరీంనగర్‌ మద్యం డిపో నుంచే సరఫరా అవుతుండగా మిగిలిన షాపులకు మంచిర్యాల మద్యం డిపో నుంచి సరఫరా చేస్తున్నారు. 


పేదలు, కూలీలు, కార్మికుల కుటుంబాల జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించాలని ఆయా కుటుంబాలకు చెందిన ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయించరాదని, బెల్ట్‌షాపులను మూసివేయించిన కొన్ని చోట్ల గ్రామపంచాయతీలో  తీర్మానాలు కూడా చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో బెల్ట్‌షాపులను మూసి వేయాలని ఆందోళనలు,  కొన్ని చోట్ల బెల్ట్‌ షాపులను ధ్వంసం కూడా చేశారు. మరోవైపు  గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో బెల్ట్‌షాపుల నిర్వహణకు లక్షల్లో వేలం పాటలు పాడుతూ డబ్బు సమకూర్చుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఆదాయమే పరమావధిగా చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    


2020-21 ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 27 లక్షల 3 వేల 825 పెట్టెల విస్కీ, 33 లక్షల 23 వేల 693 పెట్టెల బీర్‌ అమ్మకాలు సాగాయి. వీటి విలువ (మద్యం డిపో ధర)2,448 కోట్ల రూపాయలు. కరీంనగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌లోని నాలుగు జిల్లాల వారీగా పరిశీలిస్తే 


కరీంనగర్‌ జిల్లాలో 87 వైన్‌షాపులు, 29 బార్‌ అండ్‌రెస్టారెంట్‌ల ద్వారా 9 లక్షల 37 వేల 725పెట్టెల విస్కీ, 10 లక్షల 45 వేల 530 పెట్టెల బీరు అమ్మ కాలు జరిగాయి. వీటి విలువ 846 కోట్ల 82 లక్షల రూపాయలుంటుంది.


జగిత్యాల జిల్లాలోని 64 వైన్‌షాపులు, 16 బార్‌ అండ్‌రెస్టారెంట్‌ల ద్వారా 6 లక్షల 73 వేల 767 పెట్టల విస్కీ, 9 లక్షల 44 వేల, 358 పెట్టెల బీరు అమ్మకాలు జరగగా వీటి విలువ 625 కోట్ల 18 లక్షల రూపాయలుంటుంది.


పెద్దపల్లి జిల్లాలోని 74 వైన్‌షాపులు, 14 బార్‌ అండ్‌రెస్టారెంట్‌ల ద్వారా 6 లక్షల 64 వేల 729 పెట్టల విస్కీ, 7 లక్షల 37 వేల, 889 పెట్టెల బీరు అమ్మకాలు జరగగా వీటి విలువ 678 కోట్ల 4 లక్షల రూపాయలుంటుంది. 


సిరిసిల్ల జిల్లాలోని 41 వైన్‌షాపులు, 7 బార్‌ అండ్‌రెస్టారెంట్‌ల ద్వారా 4 లక్షల 27 వేల 604 పెట్టల విష్కీ, 5 లక్షల 95 వేల, 916 పెట్టెల బీరు అమ్మకాలు జరగగా వీటి విలువ 398 కోట్ల 84 లక్షల రూపాయలుంటుంది.

Updated Date - 2021-04-20T05:13:13+05:30 IST