Abn logo
Jun 7 2020 @ 13:35PM

నీళ్లనుకుని శానిటైజర్ తాగేశాడు...

విశాఖపట్నం : మంచినీళ్ళనుకుని శానిటైజర్ తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సత్తిబాబుకు శనివారం మధ్యాహ్నాం కార్యాలయంలో దాహం వేసింది. 


పొరపాటున పక్కనే ఉన్న వాటర్‌ బాటిల్‌ బదులు శానిటైజర్‌ను తాగడంతో అస్వస్థకు గురయ్యాడు. దీంతో తోటి ఉద్యోగులు స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అందజేశారు. ఇంటికి వెళ్లిన సత్తిబాబు అర్ధరాత్రి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement
Advertisement
Advertisement