Abn logo
Apr 5 2021 @ 09:04AM

హైదరాబాద్ : మద్యం మత్తులో యువకుల వీరంగం

హైదరాబాద్/హైదర్‌నగర్‌ : మద్యం మత్తులో ఇద్దరు యువకులు జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. టీఏ7ఈయూ7477 ఇన్నోవా కారులో మద్యం తాగుతూ వచ్చి రోడ్డు పక్క సోడాలు విక్రయిస్తున్న బండి వద్ద ఆపారు. సోడాలు అమ్మే వ్యక్తితో గొడవ పడ్డారు. సోడా బండిని కింద పడేశారు. స్థానికులు రాగా, వారితోనూ గొడవ పడ్డారు. కేపీహెచ్‌బీ పోలీసులు వచ్చి యువకులను, కారులో మద్యాన్ని, కారును పోలీ‌స్‌స్టేషన్‌కు తరలించారు.  ఆ కారు వెనుక, ముందు పోలీస్‌ అని రాసి ఉంది. కారు నిజంగా పోలీసు అధికారిదా, లేక పోలీస్‌ స్టిక్కర్‌ అంటించి అక్రమాలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు సృష్టి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరు మీద రిజిస్ట్రర్‌ అయి ఉంది. యువకుల పేర్లు అరుణ్‌, శ్రీనివా్‌సగా పోలీసులు గుర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement