Sep 21 2021 @ 01:03AM

దృశ్యం 2 సెన్సార్‌ పూర్తి

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దృశ్యం 2’. వెంకటేష్‌, మీనా జంటగా నటించారు. గతంలో వచ్చిన హిట్‌ చిత్రం ‘దృశ్యం’కి ఇది కొనసాగింపు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకొంది. ‘దృశ్యం 2’కు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ లభించినట్టు చిత్రబందం సోమవారం తెలిపింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’కు ఇది రీమేక్‌. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఆశీర్వాద్‌ సినిమాస్‌, రాజ్‌కుమార్‌ థియేటర్స్‌తో కలసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం వెంకటేష్‌ ‘ఎఫ్‌ 3’ చిత్రంలో నటిస్తున్నారు.