Abn logo
May 22 2020 @ 08:36AM

‘దృశ్యం’ సీక్వెల్‌

మోహ‌న్‌లాల్‌, మీనా జంట‌గా న‌టించిన చిత్రం ‘దృశ్యం’. 2013లో జీతూ జోసెఫ్ ద‌ర్శ‌కుడిగా రూపొందిన మ‌ల‌యాళ చిత్రం భారీ విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రీమేక్ అయ్యాయి. అన్నీ భాష‌ల్లోనూ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ స‌క్సెస్‌ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెర‌కెక్క‌నుంది. ఈ విష‌యాన్ని మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం రోజున క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. సీక్వెల్‌ను కూడా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయ‌నున్నారు. సీక్వెల్‌లో మోహ‌న్‌లాల్ జంట‌గా మీనా న‌టించ‌నున్నారు. మ‌రి సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ అవుతోందో? లేదో?  తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement