డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌

ABN , First Publish Date - 2022-01-22T19:44:02+05:30 IST

జీడిపప్పు - పావు కప్పు, బాదం పలుకులు - పావు కప్పు, పిస్తా - పావు కప్పు, వాల్‌ నట్స్‌ - పావుకప్పు, ట్యూటీ ఫ్రూటీ - అరకప్పు,

డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌

కావలసినవి: జీడిపప్పు - పావు కప్పు, బాదం పలుకులు - పావు కప్పు, పిస్తా - పావు కప్పు, వాల్‌ నట్స్‌ - పావుకప్పు, ట్యూటీ ఫ్రూటీ - అరకప్పు, ఎండు ద్రాక్ష - పావు కప్పు, కోడిగుడ్లు - ఐదు, వెన్న - ముప్పావు కప్పు, పంచదార - ఒక కప్పు, ఉప్పు - కొద్దిగా, వెనీలా ఎసెన్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, మైదా - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకులపొడి - ఒక టీస్పూన్‌, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, బీటర్‌, మైదా పొడి పిండి కొద్దిగా. 


తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత స్టవ్‌పై ఒక వెడల్పాటి పాన్‌పెట్టి జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను డ్రై రోస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  ఒక బౌల్‌లో మైదా తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, ఎండు ద్రాక్ష, ట్యూటీ ఫ్రూటీ, పిస్తా పలుకులు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను వేసి బాగా కలుపుకోవాలి.  తరువాత రెండు చిన్న బౌల్స్‌ తీసుకుని వాటిలో కోడిగుడ్లు కొట్టి ఒక దాంట్లో తెల్లసొన, మరొక దాంట్లో పచ్చసొన వేయాలి. మరొక బౌల్‌లో వెన్న తీసుకుని అందులో పంచదార వేసి క్రీమ్‌లా తయారయ్యేలా బీటర్‌తో కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కోడిగుడ్డు పచ్చసొన కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటర్‌తో కలపాలి. తరువాత వెనీలా ఎసెన్స్‌ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమంను క్రీమ్‌లో కొద్దికొద్దిగా వేసుకుంటూ స్పూన్‌తో కలియబెట్టాలి. ఎగ్‌వైట్‌ బౌల్‌ను తీసుకుని బీటర్‌తో హైస్పీడ్‌లో కలపాలి. ఇలా చేయడం వల్ల ఎగ్‌వైట్‌ ఫోమ్‌ మాదిరిగా తయారవుతుంది. తరువాత దీన్ని డ్రై ఫ్రూట్స్‌, క్రీమ్‌ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. రెడీ అయిన కేక్‌ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.  కేక్‌ పాన్‌ తీసుకుని దానికి వెన్న పూసి, పొడి పిండి చల్లాలి. తరువాత కేక్‌ మిశ్రమం వేసి గాలి బుడగలు లేకుండా సమంగా పరచాలి. 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీ హీట్‌ చేసుకున్న ఓవెన్‌లో పావుగంట పాటు బేక్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-01-22T19:44:02+05:30 IST