ఎండిపోతున్న సాగునీటి చెరువులు

ABN , First Publish Date - 2021-10-25T05:27:49+05:30 IST

ఎర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో సాగు నీటి చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయి.

ఎండిపోతున్న సాగునీటి చెరువులు
నీరు లేని మురారిపల్లె పెద్ద చెరువు

పడిపోతున్న భూగర్భ జలాలు

ఆందోళనలో రైతులు

ఎర్రగొండపాలెం, అక్టోబరు 24 : ఎర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో  సాగు నీటి చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో  సాగుకు, తాగేం దుకు నీరు సరఫరా జరగాలంటే వర్షాలు సంవృద్ధిగా కురవాలి. వాగులు, వంకల ద్వారా నీరు చెరువుల్లోకి చే రాలి. దాంతో భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్య తీరుతుంది.  ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో  సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. మరోపక్క సాగు నీటి చెరువులు ఎండి పోతున్నాయి. ఎర్రగొండపాలెం సబ్‌ డివిజన్‌లో ఖరీఫ్‌ ముగిసి రబీసీజన్‌ ప్రారంభమైనా వర్షాలు కురవక పోవడంతో   మెట్టపైర్లు, పండ్ల తోటలు బెట్టకు వస్తున్నాయి.  2021 జూన్‌లో సాధారణ వర్షపాతం 70.7 మి.మీ. కాగా, నమోదైన వర్షపాతం 51.4 మి.మీ. జులైలో 84.5 కాగా 164.6 మి.మీ. కురిసింది. ఆగ స్టులో 82.4 కాగా 72.6 మి.మీ, సెప్టెంబరులో 143.5కు గాను 60.2,  అక్టోబరులో 161.4కు గాను 22.0 మి.మీ. వర్షపాతం నమోదయింది. అనుకున్న మేర వర్షాలు కుర వకపోవడంతో గ్రామాల్లో తాగునీటి బోర్లలో భూగర్భజలాలు తగ్గిపోయి, తాగునీటి సమస్య తలెత్తుతోందని రై తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎర్రగొండపా లెం దశబంధం చెరువు కింద 420 ఎకరాలు మాగాణి, మురారిపల్లె పెద్దచెరువు కింద 1200 ఎకరాలు, గంగాపాలెం చెరువు కింద 120 ఎకరా లు, కొలుకుల  చెరువు కింద 115 ఎకరాలు, గండిచెరువు కింద 1200 ఎకరాలు. అమానిగుడిపాడు చెరువు కింద 100 ఎకరాలు, పుల్లలచెరువు మండలం చాపలమడుగు చెరువు కింద 120 ఎకరాలు,  త్రిపురాంతకం చెరువు  కింద 100 ఎకరాల విస్తీర్ణలో మాగాణి భూములు ఉన్నాయి.  ఈ చెరువుల్లో  నీరు లేక పత్తి, కంది సాగు చేశారు. కొంతమంది రైతులు బోర్లు వేసి మిరపసాగు  చేసినా బోర్లలో  నీరు లేకపోవడంతో పైర్లు బెట్టకు వస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబరులో నైనా వర్షాలు కురవక పోతే  నీటి ఇబ్బందులు తప్పవని ప్రజలు అంటున్నారు. 




Updated Date - 2021-10-25T05:27:49+05:30 IST