Jun 12 2021 @ 16:58PM

నలుగురు అబ్బాయిలపై ప్రతీకారం!

బాగా చదువుకొని గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు మోసం చేస్తే.. వారిపై ఆ అమ్మాయి ప్రతీకారం ఎలా తీర్చుకుందన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘డీఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నిర్మాత నట్టి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన కుమార్తె కరుణ కథానాయుకగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శనివారం ఈ చిత్రంలో తొలి పాటను విడుదల చేశారు. నిర్మాత క్రాంతి మాట్లాడుతూ ‘‘లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు సక్సెస్‌ రేట్‌ ఎక్కువ. ఈ చిత్రం కూడా అలాగే ఆకట్టుకుంటుంది. కశ్మీర్‌ లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.