ఘటనపై డీఎస్పీ విచారణ

ABN , First Publish Date - 2021-08-02T05:28:03+05:30 IST

ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో వృద్ధురాలి మృతి చెందడంపై డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై డీఎస్పీ విచారణ
నారాయణమ్మ కుటుంబీకులను విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి

 హత్య, అట్రాసిటీ కేసు నమోదు

మదనపల్లె క్రైం, ఆగస్టు 1: ఆస్తి కోసం జరిగిన ఘర్షణలో వృద్ధురాలి మృతి చెందడంపై డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా.. .కొత్తకోట మండలం బయప్పగారిపల్లెకు చెందిన నారాయణమ్మ(70) శనివారం గ్రామంలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. డీఎస్పీ రవి మనోహరాచారి, రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఆదివారం ఆస్పత్రికి చేరుకుని ఘటనపై బాధిత కుటుంబీకులను విచా రించారు. కాగా నారాయణమ్మ కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన అశోక్‌, ప్రసాద్‌ నెలరోజుల కిందట ఆస్తి విషయమై గొడవపడ్డారు. శని వారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో నారాయణమ్మ తీవ్రంగా గాయపడగా కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వృద్ధురాలి మృతికి కారకు లైన వారిపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నామన్నారు. అదే విధంగా మరిన్ని కోణాల్లో కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్మోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:28:03+05:30 IST