Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌, న వంబరు 30 : ట్రాఫిక్‌ నిబం ధనలపై ప్రతి విద్యార్థికి అవ గాహన ఉండాలని ఉప రవా ణా కమిషనర్‌ వి.సిరిఆనంద్‌ తెలిపారు. సీఆర్‌ఆర్‌ పీజీ కళాశాలలో ‘ట్రాఫిక్‌ నిబంధ నలు–రోడ్డు భద్రత’ అనే అంశంపై మంగళవారం అతిథి ఉపన్యాస కార్యక్రమం జరిగిం ది. ముఖ్య వక్తగా ఆమె మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి రోడ్డు నియమాలపై అవ గాహన కలిగి ఉండాలన్నారు. కరస్పాండెంట్‌ డాక్టర్‌ విష్ణుమోహన్‌ మాట్లా డుతూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామరాజు మాట్లాడారు. డీటీసీ సిరిఆనంద్‌ను కళాశాల యాజమాన్యం సత్కరించింది. పీజీ కళాశాల కరస్పాండెంట్‌ కలగర శివరామకృష్ణప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌, అధ్యాపకులు శ్రీనివాసరావు, రాజేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement