పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

ABN , First Publish Date - 2021-02-25T04:19:10+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ డీటీఎఫ్‌ నాయకులు మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద బుధవారం నిరసన తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి
మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న డీటీఎఫ్‌ నాయకులు

-మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీటీఎఫ్‌ నాయకుల నిరసన

ఏసీసీ, ఫిబ్రవరి 24: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ డీటీఎఫ్‌ నాయకులు మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి  జయకృష్ణ మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుకుంటూ పోతోం దన్నారు. సామాన్య ప్రజానికానికి, మధ్య తరగతికి పెనుభారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో  సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆసంపల్లి రమేశ్‌, బి. కుమార్‌, కార్యదర్శులు జాకీర్‌, విజయ్‌, శ్రీమన్నారాయణ, సభ్యులు సురేష్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:19:10+05:30 IST