Abn logo
Jun 11 2021 @ 17:54PM

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఉపాధ్యాయుల డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ క్యాంపస్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా అమర్చిన పరికరాలతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఢిల్లీ వర్సిటీ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి లేదా తమకు కరోనా సోకినట్లయితే సిబ్బందికి ప్రత్యేక కోవిడ్-19 సంరక్షణ సెలవు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌తో గురువారం జరిగిన సమావేశంలో ఢిల్లీ వర్సిటీలో ఉన్న సమస్యలపై చర్చించారు.

Advertisement
Advertisement
Advertisement