మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుబాయి!

ABN , First Publish Date - 2020-04-10T09:49:42+05:30 IST

ఎడారి నగరం దుబాయ్‌ పర్యాటకానికి ప్రసిద్ధి కావడంతో.. ఇక్కడ ఆల్కహాల్‌ వినియోగం ఎక్కువ. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ ఉండే బార్‌లు, రెస్టారెంట్లు లాక్‌డౌన్‌ కా

మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుబాయి!

దుబాయ్‌, ఏప్రిల్‌ 9: ఎడారి నగరం దుబాయ్‌ పర్యాటకానికి ప్రసిద్ధి కావడంతో.. ఇక్కడ ఆల్కహాల్‌ వినియోగం ఎక్కువ. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ ఉండే బార్‌లు, రెస్టారెంట్లు లాక్‌డౌన్‌ కారణంగా వెలవెలబోతున్నాయి. పంపిణీదారులతోపాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో హోం డెలివరీకి అవకాశం కల్పిస్తూ రెండు ప్రముఖ పంపిణీ సంస్థలకు దుబాయ్‌ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎంఎంఐ, ఆఫ్రికన్‌ అండ్‌ ఈస్టర్న్‌ భాగస్వామ్యంలోని పంపిణీ సంస్థలు లీగల్‌హోండెలివరీ.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా హోండెలివరీ అందించేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్‌ వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండిపోయిన విదేశీయులు తమ పాస్‌పోర్టులు చూపించి ఆన్‌లైన్‌లో ఆల్కహాల్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2020-04-10T09:49:42+05:30 IST