వైరల్ వీడియో! ఆస్ట్రిచ్ పక్షితో దుబాయ్ యువరాజు ‘సైకిల్ రేస్’!

ABN , First Publish Date - 2021-01-05T21:09:12+05:30 IST

దుబాయ్ యువరాజుకు సైకిల్ రేసుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో! ఆస్ట్రిచ్ పక్షితో దుబాయ్ యువరాజు ‘సైకిల్ రేస్’!

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ యువరాజుకు సైకిల్ రేసుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. యువరాజు షేక్ హమ్‌దమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధికారిక ఇన్‌స్టా‌ ఖాతాలోనే ఈ వీడియో పోస్టైంది. ఇటీవల యువరాజు సైక్లింగ్ చేస్తుండగా ఆయనకు కొన్ని ఆస్ట్రిచ్ పక్షులు తారసపడ్డాయి. అయితే..ఆయన తన సహజశైలిలో వేగంగా సైకిల్ పోనివ్వడంతో..ఆస్ట్రిచ్‌లు కాస్తంత వెనుకపడ్డట్టు వీక్షకులకు అనిపిస్తుంది. సరిగ్గా ఈ కారణంగానే ప్రస్తుత వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రిచ్‌తో యువరాజు సైకిల్ రేస్ అంటూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. 


ఈ రేసులో విజేత ఎవరో అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు. మరి కొందరు మాత్రం ప్రమాదం తప్పిపోయిందని కూడా వ్యాఖ్యానించారు. ఈ పక్షులు మనుషులపై దాడి చేసి గాయపరచగలవని కూడా పేర్కొన్నారు. భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షిగా ఆస్ట్రిచ్ ‌పేరిట ప్రపంచ రికార్డు ఉన్న విషయం తెలిసిందే. కాగా.. యువరాజు వీడియోకు ఇప్పటివరకూ దాదాపు 4.4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో యువరాజు మఖ్తూమ్‌కు చాలా ఫాలోయింది ఉంది. తన మెర్సిడీజ్ కారుపై ఓ పక్షి గూడు కట్టుకున్న కారణంగా కారును బయటకు తీసేందుకు గతంలో ఆయన నిరాకరించారు. అప్పట్లో ఇది నెటిజన్ల మనసు దోచుకుంది. యువరాజుపై ప్రసంశల వర్షం కురిసింది. 



Updated Date - 2021-01-05T21:09:12+05:30 IST