దుబాయిలో భారతీయుడికి జాక్‌పాట్!

ABN , First Publish Date - 2021-03-22T17:24:30+05:30 IST

యూఏఈలో 34 ఏళ్ల భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. దీంతో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాహుల్ కొవితల గత 12ఏళ్లుగా దుబాయిలో నివసిస్తున్నా

దుబాయిలో భారతీయుడికి జాక్‌పాట్!

దుబాయి: యూఏఈలో 34 ఏళ్ల భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. దీంతో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాహుల్ కొవితల గత 12ఏళ్లుగా దుబాయిలో నివసిస్తున్నాడు. ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో ఫైనాన్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం అతను తన 24 మంది సహాద్యోగులతో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కాగా.. ఆయన కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్టు దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ నిర్వాహకులు శనివారం ప్రకటించారు.


రాహుల్ కొవితల.. 1 మిలియన్ డాలర్లను(భారత కరెన్సీలో సుమారు రూ.7.24కోట్లు) గెలుచుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో స్పందించిన రాహుల్ కొవితల.. సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సహోద్యోగులతో కలసి లాటరీ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా గెలిచుకున్న ఈ మొత్తాన్ని సహోద్యోగులతో పంచుకోనున్నట్టు వెల్లడించారు. కాగా.. దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనర్ డ్రాను నిర్వాహకులు 1999లో ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు 177 మంది భారతీయులు జాక్‌పాట్ కొట్టి 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో కేరళకు చెందిన రాహుల్ కొవితల కూడా చేరారు. 


Updated Date - 2021-03-22T17:24:30+05:30 IST