కొవిడ్ ఆంక్షలు పొడిగించిన దుబాయ్ !

ABN , First Publish Date - 2021-02-27T13:57:47+05:30 IST

గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది.

కొవిడ్ ఆంక్షలు పొడిగించిన దుబాయ్ !

యూఏఈ: గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగించింది. ఇప్పటికే ఆంక్షలు అమలులో ఉండగా వీటిని రంజాన్ మాసమైన ఏప్రిల్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం నేతృత్వంలోని దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రిసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా అమలు చేయాల్సిన కొవిడ్ నిబంధనలను కమిటీ తెలియజేసింది. 

1. సినిమా హాళ్లు, ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్లు, ఇతర వినోద కార్యక్రమాల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతించాలి 

2. షాపింగ్ మాల్స్, హోటళ్లు, స్విమ్మింగ్ పుల్స్‌లో 70 శాతం సందర్శకులకు మాత్రమే అనుమతి

3. పబ్స్/బార్స్ పూర్తిగా బంద్

4. రెస్టారెంట్స్, కేఫ్‌లు ఒంటి గంటకే మూసివేయాలి

5. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి


ఇక యూఏఈ, దుబాయ్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ సందర్భంగా సుప్రీం కమిటీ అభినందించింది. ఈ నెల 25 వరకు దేశవ్యాప్తంగా 5.6 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు పేర్కొంది. అలాగే 30 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి అయిన్లు వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక టెస్టులు, టీకాలు ఇచ్చిన దేశాల జాబితాలో యూఏఈ కూడా ఉన్నట్లు కమిటీ తెలియజేసింది. 




Updated Date - 2021-02-27T13:57:47+05:30 IST