ఈ బందీఖానా నాకొద్దు.. యువరాణి సంచలన వీడియో

ABN , First Publish Date - 2021-02-21T01:35:43+05:30 IST

ఎంతటి బంగారు పంజరమైనా.. స్వేచ్ఛ లేకపోతే ఎందుకు? ఇప్పుడు దుబాయ్ యువరాణి లతీఫా పరిస్థితి అలాగే ఉంది.

ఈ బందీఖానా నాకొద్దు.. యువరాణి సంచలన వీడియో

ఎంతటి బంగారు పంజరమైనా.. స్వేచ్ఛ లేకపోతే ఎందుకు? ఇప్పుడు దుబాయ్ యువరాణి లతీఫా పరిస్థితి అలాగే ఉంది. పెద్ద భవంతి.. కోరిన క్షణాల్లో తెచ్చిచ్చే సిబ్బంది.. ఆమెను నిరంతరం కాపాడే అంగరక్షకులు. ఇన్ని ఉన్నా ఆమెకు స్వేచ్ఛ లేకపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురవుతుంది. తండ్రి ఆంక్షల నడుమ తాను బతకలేనంటూ తప్పించుకొనే ప్రయత్నాలు చేసింది. కానీ అవీ బెడిసి కొట్టాయి. భారత్‌లోని గోవా తీరంలో ఆమెను పట్టుకుని.. మళ్లీ ఆ పంజరంలోనే పడేశారు. 


తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఒకటి బయటపడింది. యువరాణిగా పుట్టినందుకు తనకు స్వేచ్ఛలేదంటూ వీడియోలో వాపోయింది. ఈ వీడియోను బ్రిటన్ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. 



Read more