ఎయిరిండియా విమానాలపై దుబాయ్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-09-19T07:06:00+05:30 IST

దుబాయ్‌ విమానయాన శాఖ ఎయిరిండియా విమానాల రాకపోకలను అక్టోబరు 2 వరకు నిలిపేసింది. ఈ విమానయాన సంస్థ

ఎయిరిండియా విమానాలపై దుబాయ్‌ ఆంక్షలు

అక్టోబరు 2 వరకు నిలిపివేత

కొవిడ్‌ రోగుల ప్రయాణమే కారణం

పొరపాటు జరిగిందన్న  ఎయిరిండియా


 న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: దుబాయ్‌ విమానయాన శాఖ ఎయిరిండియా విమానాల రాకపోకలను అక్టోబరు 2 వరకు నిలిపేసింది. ఈ విమానయాన సంస్థ కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ల విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారత్‌ నుంచి వస్తున్న ప్రతి ప్రయాణికుడు 96 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని, నెగెటివ్‌ రిపోర్టుతో విమానం ఎక్కాలి.

అయితే కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ల విషయంలో పొరపాట్లు జరగడంతో దుబాయ్‌ ప్రభుత్వం ఎయిరిండియా విమానాల రాకపోకలను నిలిపేసింది. జైపూర్‌, ఢిల్లీల్లోనూ ఏజెన్సీల కింది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల దుబాయ్‌కి పాజిటివ్‌ పేషంట్లను పంపడం జరిగిందని ఎయిరిండియా వివరణ ఇచ్చింది.  

Updated Date - 2020-09-19T07:06:00+05:30 IST