దుబాయ్ ట్రాఫిక్ ఫైన్ డిస్కౌంట్ స్కీమ్ రద్దు !

ABN , First Publish Date - 2020-09-23T13:28:55+05:30 IST

వాహనదారులు తమ ట్రాఫిక్ ఫైన్స్‌కు సంబంధించి వంద శాతం డిస్కౌంట్ పొందే స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా దుబాయ్ పోలీసులు వెల్లడించారు.

దుబాయ్ ట్రాఫిక్ ఫైన్ డిస్కౌంట్ స్కీమ్ రద్దు !

దుబాయ్: వాహనదారులు తమ ట్రాఫిక్ ఫైన్స్‌కు సంబంధించి వంద శాతం డిస్కౌంట్ పొందే స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో ఎడిషన్ ప్రారంభమైంది. తొలి ఎడిషన్ పూర్తైన వెంటనే రెండో ఎడిషన్‌ను ప్రారంభించారు. అయితే, ఇకపై వాహనదారుల ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఎలాంటి డిస్కౌంట్స్ వర్తించబోవని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం డైరెక్టర్ జనరల్ కల్నల్ జుమా సలీం బిన్ సువైదాన్ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఆయా డిస్కౌంట్ల కోసం నమోదు చేసుకున్నవారికి మాత్రమే డిస్కౌంట్స్ వర్తిస్తాయని ఆయన తెలిపారు.


ఇక ఈ స్కీమ్ ప్రకారం 3 నెలల పాటు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడని మోటరిస్టులకు అంతకుముందు ఉన్న జరిమానాలపై 25 శాతం డిస్కౌంట్, 6 నెలల పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు లేకపోతే 50 శాతం డిస్కౌంట్, 9 నెలల పాటు సురక్షితంగా వాహనం నడిపితే 75 శాతం డిస్కౌంట్, 12 నెలల పాటు ఎలాంటి ఉల్లంఘనలు లేని వారికి వంద శాతం డిస్కౌంట్ ఇస్తామని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా తొలి ఏడాది 5,57,430 మంది వాహనదారులు సుమారు 546,970,930 దిర్హమ్స్(రూ.10,951,347,367) మేర లాభం పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.   


Updated Date - 2020-09-23T13:28:55+05:30 IST