Advertisement
Advertisement
Abn logo
Advertisement

దుబ్బాక బంద్‌ ప్రశాంతం

దుబ్బాక, నవంబరు 29 : రాజ్యాంగాన్ని అవమానపర్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం దళిత సంఘాల నాయకులు దుబ్బాక బంద్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దుబ్బాకలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేసి బంద్‌కు సహకరించారు. అనంతరం దళిత సంఘాల ఆఽధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన నల్ల శ్రీనివా్‌సపై దేశద్రోహం కేసును నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాత్రి నల్ల శ్రీనివాస్‌ ఎవరూ లేని సమయంలో పూలమాలను వేయడంపై దళిత సంఘాల నాయకులు తప్పుపట్టారు. బహిరంగ క్షమాపణ చెప్పకుండా పూలమాల వేయడంపై విమర్శలు వెల్లువెతున్నాయి. రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు లింగం, ముత్యం, కాల్వ నరేష్‌, సురేష్‌, రాజశేఖర్‌, బాబు, బలరాం, లింగం, బాచి, రాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement